పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం చారాల గ్రామంలో గురువారం జరిగిన ఎంపీపీ పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు పర్యవేక్షకులు కే. సిద్దయ్య, కన్వీనర్ కె.గణేష్ ఆధ్వర్యంలో ప్రశాంతంగా ముగిశాయి. చైర్మన్ గా డి. శ్రీనివాసులను, వైస్ చైర్మన్ గా టి. రాణిలను ఎన్నుకున్నారు. చైర్మన్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు.