చిరుత పులిని చంపిన ఇద్దరు అరెస్ట్
చిరుత పులిని చంపిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అటవీ శాఖ అధికారి భరణి తెలిపారు. బంగారుపాలెం వద్ద ఇటీవలె ఓ చిరుత పులి చనిపోయిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు వెళుతురుచేను గ్రామానికి చెందిన ఇద్దరిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుల నుంచి చిరుతపులి కాళ్లు, గోళ్లను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశామన్నారు.