స్వామి వారి సేవలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి

63பார்த்தது
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి టీ. వెంకటేష్ నాయక్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, అర్చకులు పాల్గొన్నారు.