చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, పాలసముద్రం మండలంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని స్థానికులు సోమవారం తెలిపారు. గతంలో పోలీసులు అక్రమ ఇసుకపై కొరడా ఝలిపించినా వారి తీరు మారలేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.