చిత్తూరులో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓ మోస్తారు చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో నగర వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే పాదచారులు, చిరు వ్యాపారులు, ద్విచక్ర వాహనదారులు కాస్త ఇబ్బంది పడ్డారు. ఏమైనా ఎండ వేడి నుంచి కాస్త ఉపశమనం కలిగిందని నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.