దళితుల సంక్షేమం విస్మరిస్తే పాలకులకు పుట్టగతలుండవుని డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు అన్నారు. టెక్కలిలోని అంబేద్కర్ భవన్ లో ఆదివారం జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్ల గోపి ఆధ్వర్యంలో డి హెచ్ పి ఎస్ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరవది సుబ్బారావు మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు మనమంతా కృషి చేయాలని అన్నారు.