మెళియాపుట్టి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు ఎస్. వినోద్ అత్యాచారయత్నానికి పాల్పడడంపై కేసు నమోదు చేసినట్లు ఎఎస్ఐ నర్సింగరావు శనివారం తెలిపారు. బాలిక గత నెల 30న పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో అడ్డగించి హత్యాచారయత్నానికి పాల్పడినట్లు బాలిక తల్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పాతపట్నం సిఐ దర్యాప్తు చేసి నిందితుడిని నరసన్నపేట కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.