పలాస: మైనర్ అక్కచెల్లెలపై ఘటనలో ముమ్మరంగా కేసు దర్యాప్తు
పలాసలో ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లపై ముగ్గురు యువకులు మద్యం కలిపిన శీతల పానీయాలు తాగించి అత్యాచారానికి పాల్పడ్డారని వచ్చిన ఫిర్యాదు మేరకు కాశిబుగ్గ సీఐ మోహనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పుట్టినరోజు వేడుకలు అంటూ జగనన్న కాలనీకి మైనర్ బాలికలను తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఘటనపై సోమవారం ఆయన మాట్లాడుతూ ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.