గంజాయి నియంత్రణకు నిరంతరం ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూనే ఉండాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం రాత్రి ఇచ్చాపురం చెక్ పోస్ట్ వద్ద ఆయన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. ఎటువంటి అలసత్వం లేకుండా సిబ్బంది పని చేయాలని సూచించారు. ఆయనతోపాటు డిఎస్పి వెంకట అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.