ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబును ప్రభుత్వ విప్ గా రాష్ట్ర సర్కార్ నియమించింది. ఇందులో భాగంగా బుధవారం కవిటి మండలం కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అందుకు తోడ్పడిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్, మంత్రి అచ్చెన్నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మణి చంద్రప్రకాశ్, బాసుదేవ్, నేతింటి ధర్మారావు, ధర్మారావు పాల్గొన్నారు.