హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలి
కోటబొమ్మాలి మండలం హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలని సోమవారం పలువురు గ్రామస్థులు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కోరారు. కోటబొమ్మాళి ఎన్టీఆర్ భవన్ లో కేంద్ర మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా టెక్కలి నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి కేంద్ర మంత్రికి పలు సమస్యలపై వినతిపత్రాలు అందించారు.