మెళియాపుట్టి: 1400 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం
మెళియాపుట్టి మండలం నేలబోంతు గ్రామంలో శనివారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లా అధికారి సిహెచ్ తిరుపతి నాయుడు ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు టెక్కలి ఎక్సైజ్ సీఐ మీరా సాహెబ్ తెలిపారు. ఈ దాడుల్లో 1400 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టెక్కలి, నరసన్నపేట ఎక్సేంజ్ ఎస్ఐలు సత్యనారాయణ మూర్తి, గురుమూర్తి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.