గిరిజనుడి ఆత్మహత్య.. మద్యం మత్తులో ఘటన
కొత్తూరు మండలంలోని కొత్తగూడ గిరిజన గ్రామానికి చెందిన సవర చిన్నారావు(26)అనే గిరిజనుడు ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ చింతాడ ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు మద్యం అలవాటున్న చిన్నారావు భార్య సునీతతో గొడవలు పడుతుండడంతో కన్నవారింటికి వెళ్ళిపోయింది. దీంతో మనస్థాపం చెందిన చిన్నారావు మద్యం మత్తులో ఉరివేసుకొని తన గృహంలో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.