విజయవాడలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఇచ్చాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్, శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, ఇచ్చాపురం వైసీపీ సమన్వయకర్త పిరియా విజయ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం భేటీ అయినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.