రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ల జాబితాలో నియోజకవర్గానికి చెందిన దాసరి రాజుకు చోటు లభించింది. జనసేన ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా ఉన్న రాజు ఎంపిక పట్ల జనసైనికులు, టీడీపీ, బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా దాసరి రాజుకు టీడీపీ నాయకులు రాజు పుల్లట, సంతోష్ పట్నాయక్, మణిచంద్రప్రకాశ్, శ్రీనివాస్ రంగా, బాసుదేవ్ రౌళో, యాదవ సామాజికవర్గ పెద్దలు అభినందనలు తెలిపారు.