అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజురైన రూ. 4 లక్షలు ఆర్థిక సహాయాన్ని సోమవారం అందజేశారు. రణస్థలం మండలం బంటుపల్లిలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తమ చేతుల మీదగా చెక్కులు బాధితులకు అందజేశారు. మండలంలోని తిరుపతిపాలెం గ్రామానికి చెందిన మీసాల అరుణ, మెంటాడ పంచాయతీకి చెందిన నిద్రబింగి దుర్గమ్మలకు ఆర్థిక సహాయాన్ని పొందారు.