బూర్జ: ఎమ్మెల్యే కూన రవికుమార్ శనివారం పర్యటన వివరాలు
బూర్జ మండలం కంట్లాం పంచాయతీ పరిధి లచ్చయ్యపేట గ్రామంలో శనివారం ఉ. 10 గంటలకు భూముల రీ సర్వే పై నిర్వహించే గ్రామ సభలో ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొని వినతులు స్వీకరిస్తారని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం మ. 2 గంటలకు ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ లో ఎమ్మెల్యే పాల్గొంటారని తెలిపారు.