శ్రీకాకుళం : విద్యుత్ షాక్ తో కార్మికుడి మృతి
ఆమదాలవలస మండలం గాజులపల్లి వలస వద్ద జగనన్న కాలనీలో పనిచేస్తున్న కార్మికుడు లక్ష్మణ్ బుధవారం విద్యుత్ షాకుతో దుర్మరణం చెందాడు. ఇళ్ల పనులు చేస్తున్న సమయంలో మోటర్ వేశేందుకు వెళ్లి, ప్లగ్‌లో వైర్లు పెట్టే క్రమంలో విద్యుత్ షాక్ తగిలింది. అక్కడికక్కడే మృతి చెందిన లక్ష్మణ్ గురించి అతని తోటి కార్మికులు తెలిపారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు ఏఎస్ఐ చెప్పారు.