ఆముదాలవలస ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్ ఎస్ ఎన్ స్వామి సోమవారం కళాశాలలో ఆయన చాంబర్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. నవంబర్ 6, 7 తేదీల్లో నాక్ బృందం సభ్యులు కళాశాలకు వస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో 2016లో నాక్ బృందం పర్యటించిందని కళాశాలకు బి గ్రేడ్ ఇచ్చిందని ఆయన అన్నారు. అలాగే కళాశాలలో నడుపుతున్న వివిధ రకాల కోర్సుల గురించి, నాక్ బృంద సభ్యులు పర్యటనలో కళాశాల సందర్శిస్తారని తెలిపారు.