ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి బి ఆర్ నగర్ లో నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ కు శనివారం ఆత్మీయ సత్కారం జరిగింది. బి ఆర్ నగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ సన్మానం నిర్వహించినట్లు స్థానిక జనసేన పార్టీ నాయకులు పాత్రుని పాపారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ అరాచకాలను ప్రజలు తమ ఓటుతో వ్యతిరేకించారని అన్నారు. ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీ రావడంపై రవికుమార్ కు అభినందనలు తెలిపారు.