ఉరవకొండ పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం నాయకులు ఆధ్వర్యంలో గురువారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం ఆర్గనైజింగ్ సెక్రటరీ మధుసూదన్ నాయుడు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించి పగలుగొట్టాలని పిలుపునిచ్చి ఇప్పుడు స్మార్ట్ మీటర్లను బిగించడం సరికాదు. తక్షణం స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు.