గురువారం ఉరవకొండ మండలం కేంద్రంలో ఉన్న సెంట్రల్ ఉన్నత పాఠశాలలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు ముఖ్యఅతిథిగా ఎం.ఈ.ఓ. ఈశ్వరప్ప, సెంట్రల్ స్కూల్ హెడ్మాస్టర్ రాజేశ్వరి పాల్గొని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న అపార పుస్తకసంపదను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని, ఎక్కడ అందుబాటులో లేని పురాతన పుస్తకాలు గ్రంథాలయంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.