కూడేరు మండలం కమ్మురు, అరవకూర్ గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏవో విజయకుమార్ మాట్లాడుతూ.. వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా విస్తరణ సేవలను ప్రతి రైతు గడపకు చేరే విధంగా రైతు సాగు ఖర్చును గణనీయంగా తగ్గించి, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని అలవరచుకోవాలన్నారు. పట్టుశాఖ విహెచ్ పుల్లప్ప, విహెచ్ రామాంజనేయులు, పద్మావతమ్మ, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.