గార్లదిన్నెలో హైవేలో బస్టాప్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం పల్లెపండుగ వారోత్సవాలకు ఎంపీతో పాటు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ హాజరయ్యారు. గార్లదిన్నె హైవేలో బస్టాప్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఎంపీకి తెలిపారు. స్పందించిన ఎంపీ వెంటనే ఆర్టీసీ ఆర్ఎంకు ఫోన్ చేసి, గార్లదిన్నె హైవేలో బస్టాప్ నిర్మాణానికి తగిన చర్యలు త్వరగా చేపట్టాలని సూచించారు.