పుట్టపర్తిలో చికెన్ సెంటర్లు బంద్
ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి లో సత్యసాయి బాబా జన్మదినం సందర్బంగా ఈ నెల 18 నుంచి 24 వరకు చికెన్ సెంటర్లు మూసివేయాలని సోమవారం మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు ధిక్కరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ ప్రహల్లాద్ పేర్కొన్నారు. కావున పుట్టపర్తి చికెన్ సెంటర్ల నిర్వాహకులను సహకరించాలని కోరారు.