ఎర్రగుంట్లలో మహిళ ఆత్మహత్య
ఎర్రగుంట్లలోని స్వప్న సినిమా హాల్ సందులో నివాసముంటున్న కల్లూరు శైలజ (32) అనే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మంగళవారం స్థానికులు గుర్తించారు. 6ఏళ్ల క్రితం వీరారెడ్డి అనే వ్యక్తిని వివాహం చేసుకున్న శైలజకు కొన్ని రోజులుగా మతిస్థిమితం సరిగా లేదు. సోమవారం రాత్రి నైట్ డ్యూటీకి భర్త వెళ్లిపోయాడు. మంగళవారం మధ్యాహ్నం శైలజ ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.