నూతన యంత్రాల రాకతో నగరంలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ సాధ్యమవుతుందని అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద యంత్రాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నూతన జేసీబీలు, ట్రాక్టర్లు ద్వారా నగరంలో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు వంకలు, కాలువలలో వేగవంతంగా చెత్త, వ్యర్థాల తొలగింపు సాధ్యమవుతుందన్నారు.