శ్రీసత్యసాయి జిల్లాలోని 32మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం. వేమయ్య యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం సీపీఐ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నిన్నటి దినం రాష్ట్ర ప్రభుత్వం సత్యసాయి జిల్లాలో 10మండలాలలో మాత్రమే కరువు పరిస్థితితులు నెలకొన్నట్లు ప్రకటించడం సరికాదన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సకాలంలో వర్షాలు పడక పోవడంతో 2లక్షలు ఎకరాలలో కూడా వేరుశెనగ సాగు చెయ్యలేని పరిస్థితి ఉందన్నారు.