ఉదయగిరిని జిల్లా చేయాలని భారీ ర్యాలీ

77பார்த்தது
ఉదయగిరి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని రంగనాయకుల ఆలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు విద్యార్థులు, ఉదయగిరి సాధన సమితి సభ్యులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు. ఏటువంటి అవాంఛనీ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుకొని జిల్లా చేయాలని నినాదాలు చేశారు.