జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు