కోవూరు మండల కార్యాలయ ప్రాంగణంలో వన మహోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మొక్కలు నాటారు. ఆమె మాట్లాడుతూ. రాష్టంలో పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సరిగ్గా 30 ఏళ్ళ క్రితం సిఎంగా ప్రమాణం చేసిన అనంతరం క్లీన్ అండ్ గ్రీన్ పధకం ద్వారా రాష్టంలో పరిశుభ్రత, పచ్చదనంపై ప్రజలకు అవగాహన కల్పించి, మొక్కలు నాటి పెంచాలని తెలిపారన్నారు.