కావలి సబ్ రిజిస్టార్ సుమలత సోమవారం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందజేశారు. రిజిస్ట్రేషన్ల పరంగా ప్రజలకు ఉన్న సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఎమ్మెల్యే తెలిపారు. కార్యాలయానికి వచ్చిన ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వారిని ఎక్కువ సేపు వేచి ఉండేలా చేయకూడదని కోరారు. అనంతరం ఆమెది శుభాకాంక్షలు తెలిపారు.