నెల్లూరు పట్టణంలో శుక్రవారం జరిగిన సాగునీటి సలహా బోర్డు సమావేశంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కావలిలోని సాగునీటి సమస్యలపై రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడారు. కావలి నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉన్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. సాగు నీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్న అంశం గురించి చర్చించారు.