ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్

85பார்த்தது
ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఈ కమిషన్ నియమిస్తూ శుక్రవారం ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇటీవల ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్ట్ అనుకూలంగా తీర్పునిచ్చింది. అలాగే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ సీఎం చంద్రబాబును కలిసి ఎస్సీ వర్గీకరణపై చర్చించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி