విద్యుత్ ఘాతంతో ఓ వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా, కొండేపి మండలం కట్టుబడివారి పాలెంలో విషాదం నెలకొంది. బుధవారం విద్యుత్ ఘాతానికి జరుగుమల్లి మండలంలోని చెరుకురాపాడుకు చెందిన వెంకటేశ్వర్లు మృతి చెందాడు. ట్రాన్స్ ఫార్మర్ వద్ద పనిచేస్తున్న సమయంలో మృతుడు విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. స్థానిక ఆసుపత్రికి తరలించగా వెంకటేశ్వర్లు మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.