రాచర్ల మండలం ఎడవల్లిలో మద్యం బెల్టు షాపు నిర్వహిస్తున్న వ్యక్తిని బుధవారం ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి వద్ద నుంచి 9 క్వార్టర్ల మద్యం సీస్తాలను స్వాధీనంసీజ్ చేసుకున్నామని ఎక్సైజ్ సీఐ జయరావు తెలిపారు. మద్యం బెల్టు షాపు ఏర్పాటు చేసుకొని మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. బెల్ట్బెల్టు షాపులు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు.