ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని అర్బన్ కాలనీలో గురువారం ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ముగ్గురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గాయపడ్డ వారిలో తొమ్మిది సంవత్సరాల చిన్నారి కూడా ఉంది. గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అర్బన్ కాలనీలో పిచ్చికుక్క తిరుగుతుండడంతో స్థానిక ప్రజలు హడలిపోతున్నారు. పిచ్చికుక్క భారీ నుంచి కాపాడాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.