ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని మినరల్ వాటర్ ప్లాంట్ల యజమానులను గురువారం నగర పంచాయతీ అధికారులు హెచ్చరించారు. మినరల్ వాటర్ నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. సంజీవరెడ్డి నగర్ లో పురుగులు పడ్డ మినరల్ వాటర్ విషయం అధికారుల దృష్టికి రావడంతో వాటర్ ప్లాంట్ల యజమానులను తీవ్రంగా హెచ్చరించారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులకు తెలిపారు.