చీమకుర్తి పట్టణంలోని పంగులూరు కృష్ణయ్య భవన్ లో రైతు సంఘం కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకటరావు మాట్లాడుతూ ఈనెల 26వ తేదీన దేశవ్యాప్తంగా 500 జిల్లా కార్యాలయాల వద్ద సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మహాధర్నా జరుగుతుందని తెలిపారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో ధర్నా జరుగుతుందని, జిల్లాలోని రైతులంతా తరలిరావాలని తెలిపారు.