చీమకుర్తి రైతు సంఘం కమిటీ ఆధ్వర్యంలో పంగులూరు కృష్ణయ్య భవన్ లో గురువారం సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట రావు మాట్లాడుతూ ఈనెల 26వ తేదీన దేశవ్యాప్తంగా 500 జిల్లా కార్యాలయాల వద్ద సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మహాధర్నా జరుగుతాయని చెప్పారు. ఒంగోలులో జరిగే ధర్నాకు చీమకుర్తి మండలంలోని రైతులంతా తరలి రావాలని కోరారు.