కంభం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం స్థానిక సీఐ మల్లికార్జున విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్థులకు తెలిపారు. అపరిచిత వ్యక్తుల వద్ద నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు జాగ్రత్త వహించాలని, మీ తల్లిదండ్రులు చెప్పినట్లు సైబర్ నేరాల బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సీఐ విద్యార్థులను వివరించాలన్నారు.