ఈపూరు: మరో చిన్నారి కోసం గాలింపు ముమ్మరం
ఈపూరు మండలంలో ఆరేపల్లి ముప్పాళ్ళ వద్ద గురువారం అద్దంకి బ్రాంచి కెనాల్లో ఇద్దరు చిన్నారులు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో శుక్రవారం ఒక చిన్నారి మృతదేహాన్ని నీటిలో కనుగొని బయటకు తీశారు. మరోక పాప కోసం 15 మంది ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. తనిఖీల్లో వినుకొండ పట్టణ సీఐ శోభన్ బాబు, ఈపూరు ఎస్ఐ ఉమామహేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది, స్థానిక ప్రజలు పొల్గొన్నారు.పాల్గొన్నారు.