కొత్తవలస: రామలింగాపురంలో నాటుసారా పట్టివేత
కొత్తవలస మండలం రామలింగాపురంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సీఐ రాజశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో సోమవారం నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అదే గ్రామానికి చెందిన కక్కల లక్ష్మి అనే మహిళ అక్రమంగా నిల్వ ఉంచిన 5 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. నాటు సారా తయారీ, విక్రయాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు