సాలూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జె.సి
రేషన్ డిపోలకు బియ్యంతో పాటు ఇతర సరకులన్నీ ఒకేసారి సరఫరా చేయాలని మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ శోభిక అధికారులకు ఆదేశించారు. శనివారం సాలూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్ని రేషన్ డిపోలకు సరకులు చేరవేశారని సిఎస్ డిటి రంగారావును ప్రశ్నించారు. డిపోలకు పంపించే సరకులు వివరాలు తప్పనిసరిగా ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు. ఆమెతో పాటు రెవిన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.