నెల్లిమర్ల జూట్ మిల్లు ఒకప్పుడు ఆరు వేల మంది కార్మికులతో కళకళలాడేది. కాలానుగుణంగా పదవీ విరమణ చేయడం, జూట్ ఉత్పత్తులకు పెద్దగా గిరాకీ లేకపోవడం తదితర కారణాలతో కార్మికుల సంఖ్య నానాటికీ తగ్గుతూ వచ్చింది. వందేళ్ల చరిత్ర ఉన్న నెల్లిమర్ల జూట్‌మిల్లు పరిస్థితి ఇప్పుడు తిరోగమనంలో పడింది. నార కొరతతో ఐదు నెలల కిందట మిల్లు మూతపడింది. మళ్లీ ఎప్పుడు తెరుస్తారో కార్మిక సంఘం నాయకులు గాని చెప్పడం లేదు. దీంతో కార్మికుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.