బొబ్బిలి మండలం, గోపాలరాయుడుపేట గ్రామంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు(బేబీ నాయన) ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, అలాగే రైతుల ఖాతాల్లో డబ్బులు త్వరితగతిన జమ చేస్తామని తెలిపారు. పల్లెల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు తాము ఎప్పడు అండగా ఉంటామని అన్నారు.