వెలగలేరు గ్రామంలో బుడమేరుకు పడిన గండిని పూడ్చి వేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. జి. కొండూరు మండలంలోని వెలగలేరు, కోడూరు గ్రామాల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు, మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు ఆదివారం పర్యటించి బుడమేరుకు పడిన గండిని పరిశీలించారు. వెలగలేరు హై స్కూలు బుడమేటి వరద తాకిడికి గురైంది.