ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం పరిధిలోని కొండపల్లి బుడమేరు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బుడమేరులో గండ్లు పూడ్చిన చోట, కట్ట ఎత్తు పెంపు, వర్ష సూచన దృష్ట్యా గట్ల ఎత్తు పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశానుసారం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో మరల బుడమేరుకు నీరు ఎక్కువగా వచ్చిన కట్ట తెగిపోకుండా పటిష్టంగా ఏర్పాటు పనులను క్షేత్ర స్థాయిలో మంత్రి నిమ్మల పర్యవేక్షిస్తున్నారు.