నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం లోని అన్ని ప్రభుత్వ విద్య సంస్థలకు శుక్రవారం ఆప్షన్ హాలిడే ప్రకటించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆప్షన్ హాలిడే ఇస్తున్నట్లు ఉదయగిరి విద్యాశాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కొన్ని మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించినప్పటికీ మరికొన్ని పాఠశాలలు మాత్రం యధావిధిగా పాఠశాలలు నిర్వహిస్తున్నాయి.