ఉదయగిరి పట్టణంలోని పలు ఎరువులు దుకాణాలు, గోడౌన్లను వ్యవసాయ శాఖ ఏడిఈ రామిరెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ నిలువలు పరిశీలించారు. ఎక్స్పైరీ అయిన మందులను అమ్మరాదని సూచించారు. ఎమ్మార్పీ రేట్లకే ఎరువులు విక్రయించాలని, రైతులపై ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక భారం మోపకూడదని తెలిపారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసే రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలన్నారు.